ప్రాణ బంధకం ప్రమాదకరం
1) దేవుని చిత్తం చేయకుండా ఆపేస్తాయి
యేసయ్యకి మరియు పేతురుకి మధ్య వున్నది ధైవికమైన ప్రేమే కానీ ఆ ప్రేమే యేసయ్య దేవుని చిత్తము చేయడానికి అడ్డు పడేలా చేయబోయింది. పేతురుకి తెలియదు తన ప్రేమ ని సైతాను ఏమార్చడని. నీ ధైవికమైన ప్రేమని సైతను వాడుకొని ని ఎదుటి వ్యక్తి దేవుని చిత్తము చేయకుండా చేయగలడు.
మోషే పరిచర్య ముగిసినపుడు తన తరువాత ఎవరు నాయకుడుగా ఉండాలి అనే నిర్ణయం దేవునికి అప్పగించాడు కానీ, నాకు నమ్మకమైన పనివాడు యెహోషువ అతనిని నాయకుడిగా ఎన్నుకో అని దేవునికి సలహా ఇవ్వలేదు. ఎందుకంటే మోషే కి తెలుసు తన ప్రేమ దేవుని చిత్తం ని నేరెవెర్చకపోవొచ్చు అని.
సైతాను వేసే తెలివైన తంత్రం
ఆత్మీయ స్థాయిలో జరిగేది
2 కొరింథీయులకు 2:11 నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోస పరచకుండునట్లు, మీ నిమిత్తము, క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను; సాతాను తంత్రములను మనము ఎరుగనివారము కాము.
సైతాను తంత్రాలను పసిగట్టాలి
మన మనసులో ఏమి కలిగి ఉంటామో దానినే సైతను వాడుకోగలదు
2) దేవుని చిత్తం లో వున్నవాడ్ని బయటకు లాగుతాయి
ప్రియా తల్లి తండ్రులారా
మీ బిడ్డలని దేవుని చిత్తనుసరమైన పనికి పంపించి, ఎలా వున్నాడో ఎం చేస్తున్నాడో అని బాధ పడుతుంటే అది దేవుని చితమైన పనిలో దేవుని చేతిలో వున్నా మీ బిడ్డకు దేవుని సహాయం లేదు మరియు ఉండట్లేదు అని మీరు తలస్తునట్టు.
దేవుని చిత్తంలో వెళ్లినవాడికి దేవుడే కాపుదల మరియు పోషకుడు.
మీరు అనుకోవొచ్చు అది ప్రేమ అని కానీ దేవుని మీద విశ్వాసం లేనట్టుగా పరిగణించబడుతుంది.
మీరు చూపించే ప్రేమ అనుకొనే మీ అవిశ్వాసం దేవుని చిత్తంలో వున్నా మీ బిడ్డయొక్క ధైవిక ఎదుగుదల కు అడ్డమోతుంది.
ధైవిక చిత్తం మరియు ధైవిక ఎదుగుదల ని అడ్డుపరిచే ప్రేమ ధైవిక ప్రేమ కాదు అది అత్యంత ప్రమాదకరం
దేవుని పనికి విరుద్ధంగా ఆలోచించే ఏదయినా తిరుగుబాటుతనం వంటిది అందుకే దేవుని చిత్తం కి అడ్డుపడే ప్రేమ ప్రాణ బంధకం.
ఇలాంటి ప్రేమ లోకాస్తుడు కూడా చూపిస్తున్నాడు కదా
లోకప్రేమలో పడి దేవుని చిత్తం ఎంతోమంది కోల్పోయారు కదా
ప్రాణ బంధకం కలిగి వున్నావు అంటే నువ్వు నీకు తెలియకుండానే దేవుని చిత్తని అడ్డుకుంటున్నావు
ప్రాణ బంధకం చేతబడి మరియు మంత్రావిద్య తో సమానం.
ఎంతోమంది పరిశుద్ధ గ్రంధంలో ప్రాణ బంధకాలు వల్ల దేవుని చిత్తంకు విరుద్ధంగా చేసారు
హవ్వ మీద ప్రేమ ఆదాము ని దేవునికి విరుద్ధమైన పని చేసేలా చేసింది
సారా మీద ప్రేమ అబ్రాహాము ని దేవునికి విరుద్ధమైన పని చేసేలా చేసింది
సొంత రాజ్యం మీద ప్రేమ సౌలు ని దేవుని చిత్తనికి అడ్డుపడేలా చేసింది.
మీరు ఇ ప్రాణ బంధకాన్ని తీసివేయకపోతే దేవుడు తీసేస్తాడు దేవుడు తీసేస్తే అది గాయాన్ని మిగులుస్తది. గాయం అయ్యాక దేవుని ఎంతో గాయాడ్డాను దేవుడా అని ప్రార్ధించిన కూడా దేవుని నుండి సమాధానం రాకపోవిచ్చు
ఎందుకంటే
నేను ప్రేమిస్తున్నాను నాది గొప్ప ప్రేమ అనుకునే మీ ప్రేమ దేవుని దృష్టిలో సరికాకపోవొచ్చు.
మరి ముఖ్యమైంది
మీ ప్రేమ ఒకరిని దేవుని చిత్తం చేయడానికి ప్రోత్సాహపరుస్తుందా లేదా దేవుని చిత్తం లోనుండి క్రుంగతీసి లాగివేస్తుందా.
మీ ప్రేమ, మాటలు, సాంకేతలు, తళంపులు దేవుని చిత్తం చేయడానికిప్రోత్సాహపరిస్తే ఆ ఫలం మీకు కూడా ఉంటుంది
ఒకవేళ
మీ ప్రేమ,మాటలు, సాంకేతలు, తళంపులు దేవుని చిత్తం నుండి
క్రుంగతీసి లాగివేస్తుందా దానికి మీరే జవాబుదారీతనం కలిగి వుంటారు.
నా ప్రేమ గొప్ప అనుకునే మీ ప్రేమ దేవుని దృష్టిలో ఎలా ఉందొ???


Leave a comment